Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ది భీమ్ రెడ్డి క్రియేషన్స్ పతాకంపై రాజ్ భీమ్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'జయహౌ ఇండియన్స్'. ఆర్ రాజశేఖర్ రెడ్డి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'మతం పేరుతో రగిలే కార్చిచ్చులో బలయ్యేదెవరు.. నాయకులా..? అమాయకులా..? దేశమా..? ఈ కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఫస్ట్‌లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ స్పష్టం చేశారు. భిన్న మతాలను రిప్రజెంట్ చేస్తూనే, చేతుల్లో మరణాయుధాలు ఉన్నప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తున్న ఓ వ్యక్తిని పోస్టర్లో డిజైన్ చేసిన తీరుకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది' అని చిత్ర బృందం తెలిపింది. రాజ్ భీమ్ రెడ్డి, జారా ఖాన్, చమ్మక్ చంద్ర, సమీర్, ముమైత్ ఖాన్, సివిఎల్ నరసింహారావు, రామరాజు, చిత్రం శ్రీను, అనంత్, టార్జాన్, గగన్ విహారి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత: రాజ్ భీమ్ రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, సౌండ్ డిజైన్: నాగార్జున తల్లపల్లి, సినిమాటోగ్రఫీ: జైపాల్ రెడ్డి నిమ్మల, ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి, లిరిక్స్: కాసర్ల శ్యామ్, ఆర్ట్: మోహన్, మగేశ్వర రావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకుడు: ఆర్.రాజశేఖర్ రెడ్డి.