Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందిత శ్వేతా, మన్యం కష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'జెట్టి'. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణుమాధవ్. కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. తాజాగా గీత రచయిత చంద్రబోస్ ఈ సినిమాలోని 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ..' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని విడుదల చేశారు.
కార్తీక్ కొడకండ్ల మ్యూజిక్ కంపోజిషన్‌లో అనురాగ్ కులకర్ణి ఈ పాట ఆలపించారు. గంగపుత్రుల జీవన విధానాన్ని, గంగమ్మ తల్లి ఆదరణకు సజీవ శిల్పంగా ఈ పాట నిలవడం ఓ విశేషమైతే, ఈ పాటను చంద్రబోస్ రాయటం మరో విశేషం. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ, 'ఇటీవల 'పుష్ప' సినిమాలో అడవి మీద పాట రాశాను. ఇప్పుడు ఈ సినిమాలో సముద్రం గురించి, గంగపుత్రుల జీవితం గురించి 'గంగమ్మ గంగమ్మ మాయమ్మ...' అనే పాట రాశాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకుడికి కతజ్ఞతలు. చాలా చక్కటి పాట ఇది. సముద్ర ఘోష ఈ పాటలో వినిపించేలా కంపోజిషన్ చేశారు సంగీత దర్శకుడు కార్తీక్. గీత రచయితగా ఈ పాట రాయడం నాకొక కొత్త అనుభూతిని ఇచ్చింది. అనురాగ్ కులకర్ణి కూడా అంతే చక్కగా పాడాడు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.
'ఓ మత్య్సకార గ్రామంలో జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను ఇప్పటి వరకూ వెండితెర మీద కనిపించని జీవితాలను హద్యంగా దర్శకుడు సుబ్రమణ్యం పిచ్చుక ఆవిష్కరించబోతున్నారు'అని మేకర్స్ చెప్పారు.