Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరసింహ నంది దర్శకత్వంలో నిర్మాత టి.రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'జాతీయ రహదారి'. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు రాంగోపాల్ వర్మ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా హర్ట్ టచింగ్‌గా ఉంది. కరోనా పాండమిక్‌లో జరిగిన రెండు ప్రేమకథలకు దర్శకుడు నరసింహ నంది మంచి ముగింపు ఇచ్చారు. ఈ సినిమాకి నేషనల్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు రావాలని కోరుకుంటున్నాను. రిస్క్ తీసుకుని, మంచి సినిమా తీయాలని తాపత్రయ పడే నిర్మాత రామసత్య నారాయణకి ఈ సినిమా మంచి విజయం అందించాలి' అని తెలిపారు.
'ఆర్.జి. విగారి సహకారం వల్లే నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నాను. ఆయనకి నచ్చనిదే ఏ పని చేయరు. అలాంటిది మా సినిమా ట్రైలర్ చూసి, బాగుందంటూ ఓసారి డైరెక్టర్ని పిలువు అన్నారు. దర్శకుడు నరసింహ నందికి శుభాకాంక్షలు తెలిపిన మా గురువు ఆర్జీవీకి రుణపడి ఉంటాను. వినాయక చవితి కానుకగా ఈనెల 10న రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్‌లో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత రామసత్యనారాయణ చెప్పారు. డైరెక్టర్ నరసింహ నంది మాట్లాడుతూ,'నేను ఆర్.జి.వి గారిని ఎప్పుడు కలుస్తానా అని అనుకునే వాడిని. అది ఈ సినిమా ద్వారా తీరినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆర్జీవి 'శివ' సినిమా చూసి చెన్నై ట్రైన్ ఎక్కిన వాళ్లలో నేను కూడా ఒకడిని. ఆర్జీవీ ఎప్పుడు, ఎవరినీ మెచ్చుకోరు. అలాంటిది మా ట్రైలర్ చూసి, బాగుందంటూ అభినందించారు' అని అన్నారు.