Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కంటెంట్ బాగున్న సినిమాలకు థి¸యేటర్లలో ఆదరణ బాగానే ఉంటోంది. మా 'డియర్ మేఘ' సిినిమా మీద ఉన్న నమ్మకంతోనే ధైర్యంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం'
అని అంటున్నారు నిర్మాత అర్జున్ దాస్యన్. వేేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఆయన 'డియర్ మేఘ' చిత్రాన్ని నిర్మించారు.
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ నెల 3న థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'మా నేటివ్ నిర్మల్. నేను పెరిగింది మొత్తం హైదరాబాద్‌లోనే. ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేశా. లండన్‌తోపాటు హైదరాబాద్‌లోనూ వర్క్ చేశాను. నేను చిరంజీవి గారి అభిమానిని. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఆ తర్వాత సినిమాల మీద ఇష్టం పెరిగి, నిర్మాత అవ్వాలని పరిశ్రమకి వచ్చాను. నిర్మాణ సంస్థ పెట్టాలనుకుని, రెండేళ్లు ఇండిస్టీ గురించి తెలుసుకున్నా. వి.ఎన్.ఆదిత్య గారితో పరిచయం వల్ల టాలీవుడ్ గురించి చాలా విషయాలు తెలిశాయి. ఆయన దర్శకత్వంలో ఓ సినిమా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. 'డియర్ మేఘ' నా రెండో సినిమా అవ్వాలి. కానీ, ఆదిత్య గారి సినిమా ఆలస్యమై, ఇది మొదటి సినిమాగా వస్తోంది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరి. 'మేఘ' అనే క్యారెక్టర్ కోణంలో సినిమా సాగుతుంది. అబ్బాయిల లవ్ స్టోరీలు చాలా చూసి ఉంటాం. కానీ ఇది మేఘ అనే అమ్మాయి పర్సెప్షన్లో కొత్తగా ఉంటుంది. హైదరాబాద్, ముంబై, గోవాలో చిత్రీకరణ జరిపాం. ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. హరి గౌర మ్యూజిక్కు చాలా పేరొచ్చింది. ఇప్పటికే రిలీజైన మూడు పాటలకు మంచి పేరొచ్చింది. నాలుగో పాట రిలీజ్ చేస్తున్నాం. దర్శకుడు సుశాంత్ రెడ్డి 'సూపర్ స్టార్ కిడ్నాప్' చిత్రాన్ని చేశారు. ఇది ఆయనకు రెండో చిత్రం. తను అనుకున్న కథను చాలా స్పష్టంగా, ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఈ సినిమాతో ఆయన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకుంటారు. కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్ అని కాదు.. కంటెంట్ బాగుంటే థి¸యేటర్లలో సినిమాకు ఆదరణ బాగానే ఉంటోంది. ఇటీవల 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' లాంటి చిత్రాన్ని సక్సెస్ చేశారు. అందుకే, మా తొలి సినిమాని థియేటర్లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. డబ్బు కంటే సినిమా అంటే ప్యాషన్. అందుకే ధైర్యంగా థియేటర్లలో విడుదల చేస్తున్నాం. వి.ఎన్.ఆదిత్య సినిమా తర్వాత పెద్ద హీరోతో ఓ సినిమా ఎనౌన్స్ చేయబోతున్నాం. సినిమా ఇండిస్టీలో స్థిరపడాలనే గట్టి నిర్ణయంతోనే టాలీవుడ్లోకి అడుగుపెట్టాను. చాలా మంది కొత్త దర్శకులు, రచయితలు నన్ను అప్రోచ్ అవుతున్నారు. కొత్త కథలు వింటున్నాం' అని తెలిపారు.