Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిసాయికుమార్ హీరోగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అతిథి దేవోభవ'. శ్రీనివాస సినీ క్రియేషన్స్ పతాకంపై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, 'ఫస్ట్‌లుక్ చాలా బాగుంది. ఆదిలో ఎప్పడు ఒక స్పార్క్ ఉంటుంది. అలాగే అమర్ ఈ సినిమాలో ఒక పాట చూపించాడు. చాలా చాలా బాగుంది. శేఖర్ చంద్ర మంచి మ్యూజిక్ ఇచ్చారు. టైటిల్ చాలా బాగుంది. తప్పకుండా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఆది కెరీర్‌కి మరోసారి మంచి కిక్ స్టార్ట్ చేసే సినిమా అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు.
'ఆది ఈ సినిమాలో ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తారు. హీరోయిన్ నివేక్ష మంచి పెర్ఫార్మర్. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది' అని దర్శకుడు పొలిమేర నాగేశ్వర్ చెప్పారు.
ఆది సాయికుమార్ మాట్లాడుతూ,'సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. పాటలు కూడా రికార్డ్ చేశాం. నిర్మాతలు చాలా కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర మంచి సాంగ్స్ ఇచ్చారు. భాస్కరభట్ల సాహిత్యం మా సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఓ మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని తెలిపారు.
ఆదిసాయికుమార్, నివేక్ష, రోహిణి, సప్తగిరి, సూర్య, ఆదర్శ్, రవి ప్రకాశ్, రఘు కురుమంచు, బీహెచ్ఈఎల్ ప్రసాద్, గుండు సుదర్శన్, ప్రియాంక, నవీనా రెడ్డి, సత్తిపండు, ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ : కె. వేణు గోపాల్ రెడ్డి, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : రజిని రాజాబాబు, డిఓపి : అమర్ నాథ్ బొమ్మిరెడ్డి, ఎడిటర్ : కార్తిక్ శ్రీనివాస్, కొరియోగ్రాఫర్ : వి.జె.శేఖర్, హానీ, ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి, ఫైట్ మాస్టర్ : జాషువ.