Authorization
Mon Jan 19, 2015 06:51 pm
క్రియా ఫిల్మ్ కార్పొరేషన్, కాళీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుజనా రావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'గమనం'. శ్రియా, నిత్యా మీనన్, ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి, సుహాస్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రమేష్ కరుటూరి, వెంకీ పుషదపు, జ్జ్ఞాన శేఖర్ వి.ఎస్. నిర్మాతలు. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం గురించి డైరెక్టర్ సజనా రావు మాట్లాడుతూ,'ఏ కథ చెప్పినప్పటికీ దానికొక మోరల్ ఉండాలి. అలాంటి కథే మా 'గమనం' సినిమా. ఈ స్టోరీ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది' అని చెప్పారు. 'ఈ సినిమా కథ సజన హార్ట్ నుంచి వచ్చిన కథ. ఇలాంటి మంచి సినిమాలో నేనూ భాగమైనందుకు సంతోషంగా ఉంది' అని శ్రియా అన్నారు. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ,'ఇదొక బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. మా ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది' అని చెప్పారు.