Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమ యాజులు హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'డియర్ మేఘ'. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు 'శుక్రవారం' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, ''సూపర్ స్టార్ కిడ్నాప్' సినిమా తర్వాత దర్శకత్వం వహించిన చిత్రమిది. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరి. 'మజిలీ', 'నిన్ను కోరి' లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఇది సేఫ్ జోనర్ అని నమ్మి, ఈ కథతో సినిమా చేశాం. ఒక అబ్బాయి ఓ అమ్మాయిని 'డియర్ మేఘ' అని పిలుస్తాడు. అలా ఎందుకు పిలుస్తాడు అనేది థియేటర్లోనే చూడాలి. ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ ఎమోషన్ ఫీల్ అవుతారు. ఈ కథ అనుకున్నాక, మా మనసులోకి వచ్చిన ఫస్ట్ హీరోయిన్ మేఘా ఆకాష్. తనే ఈ కథను, క్యారెక్టర్‌ను జస్టిఫై చేయగలదని నమ్మాం. మేఘ క్యారెక్టర్లో తను బెస్ట్ పర్మార్మెన్స్ ఇచ్చింది. అలాగే ఆదిత్ అరుణ్ కూడా బాగా నటించాడు. మేఘ, అరుణ్ ఇద్దరి కెరీర్లో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ చిత్రానికి హరి గౌర బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నేపథ్య సంగీతం కూడా అంతే అందంగా ఉంటుంది. సినిమా రిలీజ్ తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ను కాలర్ ట్యూన్స్‌గా పెట్టుకుంటారు. కథ మీద నమ్మకంతో ఎంతో ధైర్యంగా మా నిర్మాత అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు' అని తెలిపారు.