Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతువర్మ జంటగా రూపొందుతున్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకష్ణ (చినబాబు) పుట్టినరోజు నేపథ్యాన్ని పురస్కరించుకుని ఇటీవల ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
'నాయకానాయికల పాత్రల మనస్తత్వాలు, అభిరుచులు, ఆలోచనలు, కథానుగుణంగా సాగే వినోదం, సంగీతం, నటీ నటుల ఉత్తమాభినయంతోపాటు చిత్ర కథ, సంభాషణల బలం ప్రేమ కథా చిత్రాల్లో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా చూసేలా చేశాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓ ఫీల్ గుడ్ మూవీని చూడ బోతున్నామన్న ఆసక్తిని కలిగించింది. చివరలో 'హ్యాపీ బర్త్ డే బాబారు' అంటూ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత ఎస్. రాధాకష్ణ (చినబాబు)కి పుట్టినరోజు శుభాకాంక్షలను నిర్మాత సూర్యదేవర నాగవంశి తెలియజేయడం ఆయనపై తనకున్న ప్రేమని, గౌరవాన్ని చెప్పకనే చెబుతోంది. అలాగే అక్టోబర్ నెలలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టు టీజర్లో స్పష్టం చేశారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా గురించి దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన 'కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా', 'దిగు దిగు నాగ' వంటి పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి. వీటికి ముందు విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌లు, ప్రచార చిత్రాలకూ ప్రేక్షకాభిమానుల నుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీ నటుల అభినయం వంటివన్నీ కథానుగుణంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకం ఉంది' అని అన్నారు.