Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు గోపీసుందర్ స్వరపరిచిన ఈ చిత్రంలోని 'టక్ పాట'ను చిత్ర బృందం శుక్రవారం విడుదల చేసింది. దర్శకుడు శివ నిర్వాణ పాడిన ఈ పాటకు విశేష స్పందన లభిస్తోంది.
'ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, పాటలు, టీజర్ ఇవన్నీ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తించాయి. లేటెస్ట్గా ఓ ఇంటెన్స్ ఉన్న పాటని మేకర్స్ రిలీజ్ చేశారు. దర్శకుడు శివ నిర్వాణ పాడిన ఈ పాటలో నాని క్యారెక్టర్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే ఆయన క్యారెక్టర్‌కి తగ్గట్టుగా దర్శకుడు శివ వాయిస్ చాలా ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ పాటలో నాని మాస్, యాక్షన్ అవతారంలో కనిపించిన తీరు మరిన్ని అంచనాలను పెంచింది. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈనెల నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రీతు వర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కీలక పాత్ర పోషించింది. అంచనాలకు దీటుగా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు' అని చిత్ర బృందం పేర్కొంది.