Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మా కార్యాచరణ నచ్చి మా ఃసినిమా బిడ్డలంః ప్యానెల్లో పోటీ చేసేందుకు జీవితా రాజశేఖర్, హేమ ముందుకొచ్చారు. మా రెండు నెలల మౌనానికి అర్ధం ఉంది. అందరితో చర్చించి ప్యానెల్‌ను తయారు చేశాం. పరిశ్రమకి సేవ చేయాలని వచ్చా. ఒక్కసారి అవకాశం ఇస్తే, చేసి చూపిస్తాః అని ప్రకాష్‌రాజ్ చెప్పిన మాటలు అందర్నీ షాకయ్యేలా చేశాయి. ఎందుకంటే, రాబోయే ఃమాః (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో జీవితా రాజశేఖర్, హేమ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా వీరిద్దరూ ప్రకాష్‌రాజ్ ప్యానెల్లో భాగమయ్యారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రకాష్‌రాజ్ మాట్లాడుతూ, ఃఃమాః ప్యానెల్‌ను పూర్తి స్థాయిలో ప్రకటిస్తున్నా. ఇందులో మహిళలకు సమాన అవకాశం ఇస్తున్నాం. అందరూ హేమ, జీవితా రాజశేఖర్ అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ చేస్తారని భావించారు. ఈ విషయమై హేమ, జీవితా రాజశేఖర్‌తో కూలంకషంగా చర్చించా. మా కార్యచరణను వాళ్ళ ముందు ఉంచాను. ఆ విషయాలన్నీ వారికి నచ్చాయి. దీంతో నా ప్యానెల్లో పోటీ చేయడానికి అంగీకరించారు. అలాగే తాము పోటీ చేస్తే, బాగా పని చేసేవారికి అవకాశం లేకుండా పోతుందని సాయికుమార్, బండ్ల గణేష్ చెప్పారు. అందుకే వారిని అధికార ప్రతినిధులుగా నియమించాం. త్వరలోనే మా ప్యానెల్ ఎజెండా ఏంటి?, ఎలాంటి పనులు చేస్తాం?, ఃమాః ప్యానెల్‌కు సంబంధించిన ఏది చెప్పాలన్నా తికమక లేకుండా కేవలం అధికార ప్రతినిధులే తెలియజేస్తారుః అని తెలిపారు.
అధ్యక్షుడుగా ప్రకాశ్‌రాజ్ పోటీ చేస్తున్న ఃసినిమా బిడ్డలంః ప్యానెల్లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్స్‌గా బెనర్జీ, హేమ, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, అనితా చౌదరి, ట్రెజరర్‌గా నాగినీడు, అలాగే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అనసూయ, అజరు, భూపాల్, బ్రహ్మాజీ, ప్రభాకర్, గోవిందరావు, ఖయ్యుమ్, కౌషిక్, శ్రీధర్‌రావు, ప్రగతి, శివారెడ్డి, సమీర్, సుడిగాలి సుధీర్, సుబ్బరాజు, సురేశ్ కొండేటి, తనీశ్, టార్జన్, రమణారెడ్డి బరిలోకి దిగుతున్నారు. అక్టోబర్ 10న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఃమాః క్రమ శిక్షణ కమిటీ వెల్లడించిన విషయం తెలిసిందే.