Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గల్లీరౌడీ'. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన చిత్రమిది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'ఇష్టపడిన అమ్మాయిని సొంతం చేసుకోవడానికి పెద్ద రౌడీనని బిల్డప్ ఇచ్చిన ఓ యువకుడు ఎలాంటి పాట్లు పడ్డాడు?, ఈ క్రమంలో ఎలాంటి కామెడీ క్రియేట్ అయ్యిందనేదే ఈ సినిమా. రాజేంద్ర ప్రసాద్ ఇంపార్టెంట్ రోల్ పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ కీలక పాత్రలో అలరించ బోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు ఎలాంటి భయం లేకుండా వస్తున్న ఇటువంటి తరుణంలో వారిని పూర్తిగా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న చిత్రమిది. ఆద్యంతం వినోదభరితంగా ఉండేందుకు రచయిత కోన వెంకట్ అద్భుతమైన స్క్రీన్‌ప్లేని డిజైన్ చేశారు. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మార్క్ మేకింగ్‌తో అవుట్ అండ్ అవుట్ పక్కా ఎంటర్టైనర్గా ఈ సినిమాని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేశాం' అని తెలిపారు. పోసాని కష్ణ మురళి, వెన్నెల కిషోర్, వైవా హర్ష తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: జి.వి, సంగీతం: చౌరస్తా రామ్, సాయి కార్తీక్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కథ: భాను, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్.