Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజా విక్ర మార్క'. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి.టి సమర్పణలో 88 రామారెడ్డి నిర్మిస్తున్నారు. వి.వి.వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం యువ హీరో వరుణ్ తేజ్ ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ, ''ఆర్ఎక్స్ 100' ట్రైలర్‌ని ఇదే రామానాయుడు స్టూడియోలో విడుదల చేశాం. అప్పుడు ఎటువంటి ఫీలింగ్, ఎమోషన్స్ కలిగాయో.. ఇప్పుడు ఈ సినిమా టీజర్ చాలా బాగుందన్నప్పుడు కూడా అలాగే కలుగుతోంది. మొదట ఈ సినిమాను మేమే నిర్మించాలని అనుకున్నాం. తర్వాత వేరే కారణాల వల్ల వెంటనే స్టార్ట్ చేయలేకపోయాం. అప్పుడు '88' రామారెడ్డి, ఆదిరెడ్డి ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళిద్దరికీ థ్యాంక్స్. మా దర్శకుడు శ్రీ సరిపల్లి చాలా బాగా తెరకెక్కించాడు. చందు సినిమాటోగ్రఫీ, ప్రశాంత్ ఆర్. విహారి ఇచ్చిన మ్యూజిక్ అందర్నీ సర్ప్రైజ్ చేస్తుంది. టెక్నికల్‌గానూ సినిమా హైస్టాండర్డ్స్‌లో ఉంటుంది. ఆల్రెడీ టీజర్ రెస్పాన్స్ బావుంది. తప్పకుండా హిట్ కొడతాం' అని అన్నారు. 'సరికొత్త యాక్షన్ కామెడీ చిత్రమిది. ఎంటర్టైన్మెంట్, కమర్షియల్ అంశాలు మిస్ అవ్వకుండా దర్శకుడు శ్రీ సరిపల్లి ఈ సినిమా చేశాడు' అని సుధాకర్ కోమాకుల అన్నారు. 'ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కార్తికేయ. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది' అని నిర్మాత '88' రామారెడ్డి తెలిపారు. దర్శకుడు శ్రీ సరిపల్లి మాట్లాడుతూ, 'ఆర్ట్ డైరెక్టర్, కెమెరామెన్, ఎడిటర్, నేను... మేమంతా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాం. మాకు కార్తికేయ అవకాశం ఇచ్చారు. ఆయన పెట్టుకున్న అంచనాలను చేరుకుంటానని ఆశిస్తున్నాను' అని చెప్పారు.