Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆదిత్ అరుణ్, మేఘా ఆకాష్, అర్జున్ సోమయాజుల ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'డియర్ మేఘ'. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మాత అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్‌తో విశేష ఆదరణ పొందుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం శనివారం ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో కథానాయిక మేఘా ఆకాష్ మాట్లాడుతూ,'మా చిత్రానికి థియేటర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా చూస్తే మీరు నవ్వుతారు, ఏడుస్తారు, ఉద్వేగానికి లోనవుతారు...ఇలా అన్ని ఎమోషన్స్, ఫీలింగ్స్ కలుగుతాయి. ఇలాంటి ప్యూర్ ఎమోషనల్ లవ్‌స్టోరీని ఎవ్వరూ మిస్ కావొద్దు' అని తెలిపారు.
'మా చిత్రానికి సూపర్బ్ రెస్పాన్స్ ఉంది. థియేటర్స్ విజిట్ చేశాం. సినిమా చూస్తున్న ప్రేక్షకులు మూవీని బాగా ఎంజారు చేస్తున్నాను. త్వరలో వరంగల్, కరీంనగర్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్‌స్టోరి చూడాలంటే మా సినిమాని తప్పకుండా చూడండి' అని హీరో ఆదిత్ అరుణ్ అన్నారు. మరో హీరో అర్జున్ సోమయాజుల మాట్లాడుతూ, 'ఈ సినిమా జర్నీ మాకెంతో స్పెషల్. నటించేప్పుడు మేం ఎలా ఫీలయ్యామో, థియేటర్లో ప్రేక్షకులు కూడా అలాగే అనుభూతి చెందుతున్నారు' అని చెప్పారు.