Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'టక్ జగదీష్'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత సాహు గారపాటి శనివారం మీడియాతో మాట్లాడుతూ, ''మజిలీ' సినిమాలో భార్యాభర్తల మధ్య ఉండే ఎమోషన్స్ తీశాం. ఇంకాస్త పెద్ద స్కేల్లో ఎమోషన్స్ ఉండాలని ఈ సినిమా చేశాం. ఇప్పటి వరకు నాని పోషించని పాత్ర ఇది. ప్రతీ ఇంట్లో ఇలాంటి కొడుకు ఉండాలని అనుకునేలా ఈ సినిమా ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎమోషన్స్ మీదే ఉంటుంది. అయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉండే సినిమాలు తక్కువయ్యాయి. అందుకే మేం ఇలాంటి కథతో వచ్చాం. ప్రేక్షకులందరూ మంచి సినిమా చూశామని కచ్చితంగా అనుకుంటారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలయ్య, అనిల్ రావిపూడి ప్రాజెక్ట్‌ను దసరాకు ప్రకటిస్తాం. నాగచైతన్యతో కూడా ఓ సినిమా ఉంది. విజరు దేవరకొండ బిజీగా ఉండటంతో సినిమా కుదరడం లేదు. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా కొంచెం సమయం పడుతుంది' అని తెలిపారు.
ప్రొడ్యూసర్స్ గిల్డ్ సపోర్ట్‌కి కృతజ్ఞతలు
థియేటర్ కోసమే ఈ సినిమాని ప్లాన్ చేశాం. ఏప్రిల్‌లో రిలీజ్ చేద్దామంటే కరోనా వచ్చింది. ఇప్పుడు కూడా పరిస్థితి అలానే ఉంది. త్వరలోనే థర్డ్‌వేవ్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఓటీటీలో రిలీజ్ చేద్దామనే నిర్ణయం తీసుకున్నాం. అలాగే అన్ని రకాలుగా మా సమస్యలు మాకు ఉన్నాయి. మా సినిమా ఓటీటీ రిలీజ్‌కి ఇండిస్టీ, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఇచ్చిన సపోర్ట్‌కి కృతజ్ఞతలు. హీరోలైనా, నిర్మాతలైనా.. తమ సినిమాని థియేటర్లలోనే రిలీజ్ చేయాలనుకుంటారు. పరిస్థితులు చక్కబడే అవకాశం కనిపించలేదు. మరో మార్గం లేక ఓటీటీకి వెళ్తున్నాం. అయితే మా ప్రయార్టీ ఎప్పుడూ కూడా థియేటర్లకే' అని అన్నారు.