Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ కాంబినేషన్లో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం 'లాభం'. ఎస్.పి.జననాథన్ దర్శకుడు. లాయర్ శ్రీరామ్ సమర్పణలో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని వినాయకచవితి కానుకగా విడుదలకు సిద్ధమైంది.
ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ సినిమా రూపొందింది. రైతుల కోసం పోరాడే కథానాయకుడి కథని దర్శకుడు జననాథన్ అత్యద్భుతంగా తెరకెక్కించారు. ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా ఈ సినిమా ఉంటుంది. విజయ్ సేతుపతి వంటి క్రేజీ హీరో నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యానర్‌పై తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండటం గర్వంగా ఫీలవుతున్నాం. ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈనెల 9న తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.