Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తీక్ సాయి హీరోగా పరిచయం అవుతూ చిన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ది కిల్లర్'. శ్రీమతి లలిత సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై ఆవుల రాజు యాదవ్, సంకినేని వాసు దేవ రావు నిర్మించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందిన సందర్బంగా ఆదివారం చిత్ర బృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.
ఈ సందర్బంగా హీరో, దర్శకుడు కార్తీక్ సాయి (చిన్నా) మాట్లాడుతూ, 'మా సినిమా చూసిన వారంతా కొత్తవాళ్లు తీసినట్టు లేదని అంటున్నారు. ప్రేక్షకులు బాగా ఎంజారు చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్స్ పెరిగాయి. ఈ ఆనందంతో నిద్ర పోయి ఐదు రోజులైంది. ఈ సినిమా విషయంలో నెగటివ్‌గా మాట్లాడిన వాళ్లకు గూబ పగిలే సమాధానం వచ్చింది. సినిమాకి కంటెంట్ ఉంటే పాడింగ్ అవసరం లేదు. ఈ సినిమా బాగా తీసారని ప్రశంసిస్తున్నారు. అది చాలు మాకు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక కలిపి 150కి పైగా థియేటర్స్‌లో విడుదల చేశాం. అన్ని సెంటర్స్‌లో మంచి టాక్ వచ్చింది. మా సక్సెస్‌లో అందరూ ఉన్నారు. ఇది నా పదేళ్ల కష్టం. దాన్ని ఈ రోజు నిజం చేసారు. ఈ కరోనా సమయంలో కూడా మా సినిమాకి కలెక్షన్స్ బాగున్నాయి. రెస్పాన్స్ బాగుంది' అని చెప్పారు.
'మా సినిమాని అందరించినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్. ప్రేక్షకులు మాకు మంచి విజయాన్ని అందించారు' అని నిర్మాత వాసుదేవరావు అన్నారు. లైన్ ప్రొడ్యూసర్ ప్రియా మాట్లాడుతూ,'సినిమా చూడండి. నచ్చితే బాగుందని రాయండి. లేదంటే తిట్టండి అంతే కానీ ఫేక్ న్యూస్, ఫేక్ రివ్యూస్ మాకు అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు రాయండి. మేమేమి టాటా బిర్లాల పిల్లలం కాదు. పైసా పైసా కూడబెట్టి సినిమా చేశాం. ఓ నమ్మకంతో సినిమా చేశాం' అని తెలిపారు.