Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'తలైవి' చిత్ర నిర్మాత విష్ణు ఇందూరి
అలనాటి మేటినటి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి'. వెండితెర జయలలితగా కంగనా రనౌత్, ఎంజీఆర్‌గా అరవింద స్వామి నటించారు. ఏఎల్ విజరు దర్శకుడు. విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కంగనా రనౌత్ మాట్లాడుతూ, 'మా నిర్మాత విష్ణుకి ఈ సినిమా రిలీజ్ బర్త్ డే గిఫ్ట్ అవుతుంది. మీరు ఎప్పటికీ గుర్తుంచుకునే బ్లాక్ బస్టర్ బర్త్‌డే గిఫ్ట్ ఇదే అవుతుంది. నాకు తమిళనాడు గురించి, అక్కడి రాజకీయాల గురించి కానీ ఏం తెలియదు. నేను ఈ పాత్రను పోషించగలనని విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ ఇప్పుడు నాకే వింతగా అనిపిస్తోంది. ఈ సినిమా చూసినప్పుడు విజయేంద్ర ప్రసాద్‌గారే రైట్ అనిపించింది' అని తెలిపారు. 'మూడు సంవత్సరాల క్రితం విష్ణు కలిసి, ఈ సినిమా కోసం స్టోరీ రాయమని అడగ్గానే ఓకే అన్నా. కథ చెప్పినప్పుడు వాళ్ళు వేరే హీరోయిన్ని అనుకున్నారు. కానీ నా మైండ్లోకి కంగనా వచ్చింది. అయితే ఆ విషయాన్ని అడిగేందుకు ఆమెను అప్రోచ్ అయ్యేవారు ఎవరు?, ఒకవేళ ఆమెకు కథ నచ్చక పోతే మనల్ని బతకనివ్వదు. ఆమెకు కథ నచ్చింది. 'నువ్వు నీలానే ఉండు.. నీ లానే ప్రవర్తించు'.. అదే జయలలిత క్యారెక్టర్ అని చెప్పాను. జయలలితగా కంగనా అదరగొట్టేసింది' అని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.
దర్శకుడు విజరు మాట్లాడుతూ,'మా సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాష్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్లస్ కానుంది. అరవింద స్వామి మా సినిమాకి బిగ్ పిల్లర్. జయలలిత క్యారెక్టర్లో కంగనా ఒదిగిపోయింది. ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం' అని తెలిపారు.
'ఎన్నో సినిమాల్లో నటించా, కానీ ఈ సినిమాలో భాగం కావడం చాలా అద్భుతమైన అనుభవం. ఈ సినిమాతో మీ అందరి ముందుకు రావడం గర్వంగా, ఆనందంగా ఉంది. ఓ నటుడిగా కంగనా లాంటి స్టార్లతో నటించి చాలా నేర్చుకున్నా. ఈ సినిమాని కంగనా తన భుజాలపై వేసుకొని, నటించింది. రెండు రోజుల క్రితం ఈ సినిమా చూశా. ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని నమ్ముతున్నా' అని అరవింద స్వామి చెప్పారు. ఈ వేడుకలో క్రియేటివ్ హెడ్ బృందా ప్రసాద్, పూర్ణ, భాగ్యశ్రీ, తిరుమల్ రెడ్డి, శైలేష్ సింగ్ తదితరులు ఈ సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలియజేశారు. ఈ సినిమా ఈనెల 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా చేయాలనేది మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ బందా గారి ఐడియా. ఆయన జయలలిత గారి అభిమాని. ఆమె చనిపోయినపుడు చాలా బాధపడ్డారు. ఆమె చరిత్ర జనానికి తెలియాలని ఈ సినిమా ప్లాన్ చేశారు. ఈ సినిమాకి న్యాయం చేయగలరని భావించి దర్శకుడిగా విజరుని ఫైనల్ చేశాం. అలాగే పాన్ ఇండియా ఇమేజ్ రావాలని 'తలైవి' అనే టైటిల్ పెట్టాం. విజయేంద్ర ప్రసాద్‌గారు ఈ ప్రాజెక్టులోకి రాగానే దీని స్వరూపమే మారిపోయింది. కంగనాకు తగ్గట్టుగా ఎంజీఆర్ క్యారెక్టర్‌కి అరవింద్ స్వామిని తీసుకున్నాం. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మొదటి రోజు నుంచి తిరుమల్ రెడ్డి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమాతో కంగనాకి ఐదో నేషనల్ అవార్డు వస్తుందని నమ్ముతున్నా. నా జీవితంలో ఇప్పటిదాకా చేసింది ఒక ఎత్తు, ఈ సినిమా మరో ఎత్తు అని నమ్మకంగా చెబుతున్నా.
- నిర్మాత విష్ణు ఇందూరి