Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'. సంపత్ నంది దర్శకుడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ, 'గోపీచంద్, తమన్నా కాంబినేషన్లో మా శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. పండక్కి కుటుంబం అంతా కలిసి ఎలాంటి పక్కా కమర్షియల్ హంగులున్న సినిమాను చూడాలనుకుంటారో అలాంటి సినిమానే మా సినిమా. వినాయక చవితి కానుకగా ఈనెల 10న విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కి, 'జ్వాలా రెడ్డి..' సాంగ్‌కి, అప్సరా
రాణి చేసిన స్పెషల్ సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ సంపత్ నంది మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను పర్‌ఫెక్ట్స్‌గా మిక్స్ చేసి, ప్రతి సీన్ గ్రాండియర్‌గా అందర్నీ అలరించేలా డైరెక్ట్ చేశారు. ఈనెల 10న థియేటర్స్‌లో వస్తున్న మా చిత్రం నూటికి నూరు శాతం ఆడియెన్స్‌కు మంచి ఫీస్ట్‌లా ఉంటుంది' అని చెప్పారు.