Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరేన్ వనపర్తి, దీపాలి శర్మ జంటగా నటించిన చిత్రం 'ఊరికి ఉత్తరాన'. సతీష్ దర్శకత్వంలో వనపర్తి వెంకట రత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర టీజర్‌ను సోమవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా నిర్మాత వనపర్తి వెంకటరత్నం మాట్లాడుతూ,'మంచి కథ, కథనంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి' అని చెప్పారు.
'మా నాన్నే నాకు హీరో. వ్యవసాయం చేసుకునే ఆయనకు సినిమా అంటే తెలియదు, ఆస్ట్రేలియా అంటే తెలియదు. అలాంటి వ్యక్తి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చారు. నా కలని సాకారం చేయటానికి మా నాన్న నాకు అండగా నిలబడ్డారు. ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిదంటే ఆయనే కారణం. మంచి సినిమా చేశాం అని కచ్చితంగా చెప్పగలను' అని హీరో నరేన్ అన్నారు.
దర్శకుడు సతీష్ మాట్లాడుతూ,'నన్ను, నా కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన వనపర్తి వెంకటరత్నం, మా హీరో నరేన్‌కి కతజ్ఞతలు' అని చెప్పారు. గీత రచయిత సురేష్ మాట్లాడుతూ ,'ఇందులో దేవరి సాంగ్‌తోపాటు మరొక సాంగ్ రాశాను. మా హీరో నరేన్‌కి మంచి సినిమాగా ఇది నిలిచిపోవాలి' అని అన్నారు. 'ఇది నాకు చాలా స్పెషల్ సినిమా. మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాకు తెలుగు రాకపోయినప్పటకీ అందరూ బాగా సపోర్ట్ చేశారు' అని హీరోయిన్ దీపాలి శర్మ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ :శ్రీకాంత్ అరుపుల, మ్యూజిక్ :భీమ్స్, ఎడిటింగ్ :శివ శర్వాని, స్టోరీ -స్క్రీన్ ప్లే -డైలాగ్స్ :ఉదరు, నాగమణి రాజు, కో ప్రొడ్యూసర్ :హుస్సేన్ నాయక్, లైన్ ప్రొడ్యూసర్స్ :నవీన్ చందా, త్రిలోక్ నాధ్ గడ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :మాల్యా కందుకూరి.