Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, విష్ణుప్రియ, సాయి శ్వేత, వెంకట్ కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'ది బేకర్ అండ్ ద బ్యూటీ'. జొనాథన్ ఎడ్వర్డ్స్ దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా కలిసి తెరకెక్కించిన సిరీస్ ఇది. పది ఎపిసోడ్స్‌గా రూపొందిన ఈ వెబ్‌సిరీస్ షో ఈనెల 10 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కరాచీ బేకరీ ఫార్టీఫిఫ్త్ అవెన్యూలో ఈ వెబ్‌సిరీస్ ట్రైలర్‌ని సోమవారం ఆవిష్కరించారు. కెషత్ ఇంటర్నేషనల్ ప్రపంచ ప్రఖ్యాత వెబ్ సీరీస్ 'ది బేకర్ అండ్ ద బ్యూటీ'ని స్ఫూర్తిగా తీసుకుని అదే పేరుతో తెలుగులో రూపొందించారు. మన నేటివిటీని దష్టిలో పెట్టుకుని ఆ షోకి చిన్న చిన్న మార్పులు చేశారు. మధ్య తరగతి తెలుగు కుటుంబాల్లో ఉండే కష్టసుఖాలు, కోరికలు, వాటి కోసం పడే తాపత్రయాలను ఈ షోలో చూడొచ్చు.
పక్కా లోకల్ అబ్బాయికి, అతిలోక సుందరికి మధ్య జరిగే ప్రేమాయణం, పలు రకాల భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుంది. 'ది బేకర్ అండ్ ది బ్యూటీ' ఆడియన్స్‌ని స్పెల్ బౌండ్ చేయడానికి సన్నద్ధమవుతోందని మై హౌమ్ గ్రూప్ డైరక్టర్ మేఘన జూపల్లి తెలిపారు.
'ఈ షోలో లీడ్ యాక్టర్‌గా నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర పేరు విజరు. ఈ షోలో విజరుకున్న కన్సర్న్స్, కన్ఫ్యూజన్స్, సెంటిమెంట్స్ అన్నీ నాకు తెలుసు. ఈ షోలోని ఏదో ఒక విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితంతో పోల్చి చూసుకుంటారు.' అని సంతోష్ శోభన్ చెప్పారు.