Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండియన్ క్రికెటర్ హర్భజన్ సింగ్, అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం 'ఫ్రెండ్ షిప్'. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ.ఎన్ బాలాజీ రిలీజ్ చేస్తున్నారు. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను హర్భజన్ సింగ్ విడుదల చేయగా, 'హర్భజన్ సింగ్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూడటం ఆనందంగా ఉందని, సినిమా పెద్ద సక్సెస్ కావాలని' అగ్ర కథానాయకుడు నాగార్జున చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్మాత ఎ.ఎన్.బాలాజీ మాట్లాడుతూ, 'నేటి సమాజంలో అమ్మాయిలను ఎలా చూస్తున్నారు?, వారికెలాంటి గౌరవమివ్వాలి అనే అంశాన్ని కాలేజీ నేపథ్యంలో మా డైరెక్టర్స్ తెరకెక్కించారు. పాతిక కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా తప్పకుండా వైవిధ్యంగా ఉంటుంది. రాజకీయాలకు, కాలేజ్ స్టూడెంట్స్ మధ్య ఏం జరిగిందనే విషయాన్ని ఆసక్తికరంగా, కమర్షియల్ అంశాలతో ఎంగేజింగ్‌గా తెరకెక్కించారు' అని అన్నారు.