Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భీమవరం టాకీస్ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం 'జాతీయ రహదారి'. నరసింహ నంది దర్శకుడు. ఈ చిత్రంలోని మూడవ పాటను అగ్ర దర్శకుడు బి.గోపాల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'దర్శకుడు నరసింహ నంది నా దగ్గర చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. అనేక జాతీయ అవార్డు చిత్రాలను తెరకెక్కించారు. అలాగే ఇప్పుడు తీసిన ఈ సినిమా ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. మూడవ పాటను నాతో రిలీజ్ చేయించడం హ్యాపీగా ఉంది. సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. నాకు దర్శకుడిగా జీవితాన్ని ఇచ్చిన మా రామానాయుడుగారు 150 సినిమాలు తీశారు. ఆ బాటలోనే నిర్మాత రామసత్యనారాయణ కూడా సినిమాలు తీస్తున్నారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆయనకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి' అని చెప్పారు.
'బి.గోపాల్ గారు నెంబర్ వన్ యాక్షన్ డైరెక్టర్. ఆయన చేతులు మీదుగా మా సినిమాలోని మూడవ సాంగ్ విడుదల కావడం గర్వంగా ఉంది. ఆయన శిష్యుడు నరసింహ నంది సపరేట్ పంథాలో హార్ట్ టచింగ్ కథలను సెలెక్ట్ చేసుకొని సినిమాలు చేస్తున్నారు. నేను ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు తీశాను కానీ అవార్డు వచ్చే సినిమాలు తీయలేదనే బాధ ఉండేది. ఇంత కాలానికి ఈ సినిమాతో ఆ కోరిక తీరనుంది. ట్రైలర్ చూసిన వి.వి.వినాయక్, విజయేంద్ర ప్రసాద్, యండమూరి వీరేంద్రనాథ్ తనని అభినందించారు. రాంగోపాల్ వర్మకు ఈ ట్రైలర్ నచ్చి, చాలా బాగుందని డైరెక్టర్‌ను పిలిచి మరీ ప్రశంసించారు. ఇంతమంది పెద్దలు బ్లెస్సింగ్స్ ఇచ్చారంటే ఈ సినిమా ఇప్పటికే 50% సక్సెస్ అయ్యిందని అనుకుంటున్నాను. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రెండు తెలుగు రాష్ట్రాలలో 200 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం' అని నిర్మాత రామసత్యనారాయణ అన్నారు. దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ, 'అందరూ వెళ్లే దారిలో కాకుండా కొత్త దారిలో వెళ్ళాలి అని అనేవారు. అదే జాతీయరహదారి' అని తెలిపారు.