Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయితేజ్, దేవ్ కట్టా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ 'రిపబ్లిక్'. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. సోమవారం ఈ సినిమా నుంచి 'జోర్ సే...' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. పల్లెటూరిలో జరిగే పండగ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూనే హీరో, హీరోయిన్ మధ్య హుషారుగా వచ్చేలా ఉన్న ఈ పాటకు మణిశర్మ సంగీత సారథ్యం వహించగా, సుద్దాల అశోక్ తేజ రాశారు. అనురాగ్ కులకర్ణి, సాకి శ్రీనివాస్, బరిమి శెట్టి పాడారు.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'ఇప్పటికే 'గానా ఆఫ్ రిపబ్లిక్..' సాంగ్ విడుదలై ఆకట్టుకోగా, ఇప్పుడు 'జోర్ సే' సాంగ్ సర్వత్రా సందడి చేస్తోంది. సాయితేజ్ యాక్టింగ్, దేవ్ కట్టా మార్క్ టేకింగ్ డైలాగ్స్‌తో సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి నెలకొంది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న మా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం' అని పేర్కొన్నారు.