Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'టక్ జగదీష్'. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మీడియాతో మాట్లాడుతూ, 'నేను చిన్నప్పటి నుంచి ఉమ్మడి కుటుంబంలోనే పెరిగాను. నేను చూసిన ఫ్యామిలీ ఎమోషన్స్ చూపించాలని, కొన్ని కొత్త విషయాలతో ఈ సినిమా చేశా. ఇది చాలా బలమైన కథ. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే, ట్విస్టులు కూడా ఉంటాయి. కమర్షియల్ సినిమాకి ఉండే గ్రాఫ్ ఉంటూనే, చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఈ సినిమాలో నాని ఓ సరదా మనిషి. బయటి నుంచి ఏ సమస్య వచ్చినా ఇరగ్గొడతాడు. అదే ఇంట్లోనే సమస్య వస్తే, దాన్ని ఎలా పరిష్కరించాడు అనేది కథ. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఎన్నో ఉన్నాయి. ఈ సినిమా చూస్తే మనకు ఇప్పటి జీవితం గుర్తుకు రాదు. మన ఊరు కనిపిస్తుంది. అందరినీ ఊర్లకి తీసుకెళ్తుంది. మన కళ్లు తడుస్తాయి. ఓ మంచి ఫీల్ ఇస్తుంది. ఈ కథ మొత్తం జగపతిబాబు, నానిల మధ్యే ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద వాళ్లు థియేటర్లకు రాలేరు. అయితే ఓటీటీలో నానమ్మ, అమ్మమ్మలతో కలిసి ఇరవై ఏళ్ల కుర్రాడు కూడా కలిసి చూస్తాడు. ప్రస్తుతం అమెజాన్ కూడా గ్రామాల్లోకి వెళ్తోంది. దీని వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ విజరు దేవరకొండతో మైత్రీ మూవీస్‌లో ఓ సినిమా చేస్తున్నా. ఇది ఫుల్ ఎంటర్టైనర్' అని చెప్పారు.