Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పరిశ్రమ పచ్చగా ఉండాలంటే చిన్న సినిమాలు బతకాలి. మొదట్నుంచీ నేను ఇదే కోరుకుంటున్నా. ఈ క్రమంలో నేను ఏం మాట్లాడినా సినీ పెద్దలు సీరియస్‌గా తీసుకోలేదు. పైగా స్పోర్టీవ్‌గా తీసుకున్నారు. చిరంజీవి, నాగార్జున, దాము వంటి వారు నన్ను సోదరిడిలానే భావించారు. సినిమా సమస్యలపై నేను గట్టిగా మాట్లాడినా, వాళ్ళు వ్యతిరేకించక పోవడం నా అదష్టంగా భావిస్తున్నా' అని దర్శక, నిర్మాత నట్టికుమార్ అన్నారు. బుధవారం నట్టికుమార్ పుట్టినరోజు.
ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ,'ఆఫీస్బారు నుంచి నిర్మాత స్థాయికి ఎదగటానికి కారణమైన తెలుగు కళామతల్లికి కతజ్ఞతలు. నా ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సినిమారంగానికి వచ్చి 32 ఏళ్లు అయ్యింది. ఇది 50వ బర్త్‌డే. ప్రతి ఏడాది నా బర్త్‌డేకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ ఏడాది మాత్రం నాకు చాలా చాలా స్పెషల్. నా తనయుడు నట్టి క్రాంతి హీరోగా 'సైకోవర్మ', అలాగే నా కూతురు నట్టి కరుణ హీరోయిన్గా పరిచయం అవుతూ రూపొందిన 'డి.ఎస్.జె.' (దెయ్యంతో సహజీవనం) చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే డా|| రాజశేఖర్ 'అర్జున' సినిమా విడుదలకు ప్లాన్ చేేస్తున్నా. నా కుమార్తె నట్టి కరుణ నాయికగా కాశ్మీర్ సమస్యపై ఐదు భాషల్లో ఓ సినిమా చేయబోతున్నాను. ఆర్టికల్ 370పై ఉండే కథ. మహిళకు ఉన్న హక్కుల కోసం పోరాడే ఈ సినిమాను త్వరలోనే ప్రారంభించబోతున్నా. అలాగే డా.రాజశేఖర్‌గారితో ఓ కొత్త సినిమాతోపాటు మరో మూడు సినిమాలు ప్లాన్‌లో ఉన్నాయి. ప్రతి ఏడాది 8 సినిమాలు చేయాలనే నిర్ణయంతో ఉన్నా. సినిమా పరిశ్రమలో నాకు డా. దర్శకరత్న దాసరి, డా|| డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరద్వాజ గురువులు. వారి పేర్లు ఎక్కడా చెడకొట్టకుండా, నీతి నిజాయితీగా ఉండమని వాళ్లు చెప్పినట్లు నడిచాను. రమేష్ ప్రసాద్‌గారు నాకు ఆర్థికంగా అండగా నిలిచిన రోజులు మరచిపోలేను. నేను ఏదైనా సరే.. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను. ఏ ఒక్కరూ లబ్దిపొందకూడదు. పదిమందీ సినిమారంగలో ఉండాలనేదే నా భావన. నేను ఏరోజు మాట్లాడినా ఫిలింఛాంబర్‌ను అగౌరవపర్చలేదు. చిన్న సినిమాలు బతకాలని 2000 సంవత్సరం నుంచి పోరాడుతున్నా. ఇప్పటికీ చేస్తూనే ఉన్నా. నాలాగే ఎంతో మంది కొత్తవాళ్ళు సినిమాపై ప్రేమతో వస్తున్నారు. వారంతా పరిశ్రమలో బాగుపడాలని ఆశిస్తున్నా' అని తెలిపారు.