Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం 'హనీ ట్రాప్'. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వి.వి.వామన రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. రిలీజ్ డేట్‌ని తెలియజేస్తూ చిత్ర బృందం మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వి.వి.వామనరావు మాట్లాడుతూ,'దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి ఇప్పటివరకు రొమాంటిక్ సినిమాలు తీసినప్పటికీ అండర్ కరెంట్‌గా మెసేజ్ తప్పకుండా ఉంటుంది. ఆయన తీసిన రొమాంటిక్ సినిమాలన్నీ కమర్షియల్‌గా విజయం సాధించాయి. ఆ సినిమాల కంటే భిన్నంగా ఈ సినిమా ఉంటుంది. మేం విడుదల చేసిన సాంగ్స్, టీజర్స్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సినిమా బాగుందని సెన్సార్ సభ్యులు మమ్మల్ని ప్రశంసించి 'ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ నెల 17న థియేటర్లలో మా సినిమాని విడుదల చేస్తున్నాం' అని చెప్పారు.
'మా నిర్మాత వామన రావు గారు చెప్పిన కథ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. పైగా ఆయన చాలా సెన్సిబుల్ రైటర్, నంది అవార్డు పొందిన నాటకాలను రాసిన గొప్ప రచయిత. అన్నింటికిమించి మంచి టెస్ట్ ఉన్న నిర్మాత. ఆయనతో వర్క్ చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంచి కాన్సెప్ట్‌తో రిలీజ్ అవుతున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది' అని దర్శకుడు పి.సునీల్ కుమార్‌రెడ్డి అన్నారు.