Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాచీ క్రియేషన్స్ పతాకంపై రుషికా రాజ్, రాజా నరేంద్ర ఆకుల, కేశవ్ దీపిక ముఖ్య పాత్రధారులుగా నటించిన చిత్రం 'అశ్మీ'. నూతన దర్శకుడు శేష్ కార్తీకేయ దర్శకత్వంలో స్నేహా రాకేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా ఇందులో లీడ్ రోల్లో నటించిన రాజా నరేంద్ర ఆకుల మీడియాతో మాట్లాడుతూ,'మాది ఏలూరు. చిన్నప్పటి నుండి నటుడ్ని అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూసి పెరిగాను. ఆ తరువాత ప్రభాస్ 'ఈశ్వర్' సినిమా చూసి, ఆయన స్ఫూర్తితో బాడీ బిల్డింగ్ చేయడం మొదలు పెట్టాను. అప్పటి నుంచి స్పోర్ట్స్‌లో రాణిస్తూ ఇంటర్నేషనల్ మిస్టర్ వరల్డ్ టైటిల్ విన్నర్ అయ్యాను. బాడీ బిల్డర్‌గానే కాకుండా యాక్టర్ అవ్వాలనే మా నాన్న కలను నెరవేర్చడానికి ఇండిస్టీకి వచ్చాను. ఈ చిత్ర దర్శకుడు శేషు కార్తికేయ, నేను మంచి స్నేహితులం. మేం అనుకున్న కథ నిర్మాత స్నేహా రాకేశ్‌కు నచ్చడంతో ఈ సినిమా ట్రాక్ ఎక్కింది. ఇటీవల విడుదలైన మా సినిమాకి అన్ని ఏరియాల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల ఆదరణతో సినిమా సక్సెస్ అయింది. డిఫరెంట్ థ్రిల్లర్ అంటూ రివ్యూ రేటింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. ప్రస్తుతం 14 రీల్స్ ప్రొడక్షన్లో అనీష్ కురువిల్లా దర్శకత్వంలో హాట్ స్టార్ ప్రాజెక్ట్ వెబ్ సిరీస్ చేస్తున్నా. నేను, ప్రియానంద్ నటించిన ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. అలాగే ఓ కామెడీ మూవీతోపాటు జనవరిలో సోనీ రవితో ఒక ప్రాజెక్టు చేస్తున్నాను. మంచి కథలు, మంచి పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించాలన్నదే నా లక్ష్యం' అని చెప్పారు.