Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ కొత్త పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ఈ సందర్భంగా మేకర్స్ మాట్లాడుతూ, 'అఖిల్ క్యారెక్టర్‌లోని 7 వెర్షన్స్‌ని చూపిస్తూ 7 విభిన్నమైన గెటప్స్, అలాగే ఫార్మల్ లుక్ నుంచి.. మోడ్రన్ అవతారం వరకు అన్ని షేడ్స్‌లో ఉన్న పోస్టర్ అందర్నీ విశేషంగా అలరిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ పోస్టర్‌లోని 7 వెర్షన్స్ గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా దర్శకుడు భాస్కర్ డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో కూడా అన్ని పాత్రలను ఆయన అలాగే డిజైన్ చేశారు. ఇందులోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల క్యారెక్టర్లు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్ 8న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాం' అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ : అల్లు అరవింద్, మ్యూజిక్ : గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ : ప్రదీశ్ ఎమ్ వర్మ, ఎడిటర్ : మార్తండ్. కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్ : అవినాష్ కొల్లా.