Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం 'ప్లాన్-బి'. ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కె.వి.రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా దర్శకుడు కె.వి.రాజమహి మాట్లాడుతూ, 'ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా, సరికొత్త కథ కథనంతో, థ్రిల్లింగ్ అంశాలతో సాగే కథ ఇది. సెన్సార్ సభ్యులు మా చిత్రాన్ని చూసి అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేం ఎప్పుడు చూడలేదని ప్రశసించారు. యు/ఎ సర్టిఫికెట్ పొందిన మా సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి, మురళీ శర్మ, సూర్య వశిష్ట, రవిప్రకాష్ వీళ్లందరి నటన మా చిత్రానికి హైలైట్' అని చెప్పారు.
'మా సినిమా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా రాజమహి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మా చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించడం హ్యాపీగా ఉంది. ఈనెల 17న మా చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేేస్తున్నాం' అని నిర్మాత ఎవిఆర్ తెలిపారు.
సూర్య వశిష్ట, డింపుల్, మురళీ శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి, చిత్రం శ్రీను, రాజేంద్ర, బ్లాక్ స్టార్ షాని, డెబోరా దొర్రీస్ ఫిల్, మీనా వాసు, దయానంద్ రెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా : వెంకట్ గంగాధరి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్), ఎడిటర్ : ఆవుల వెంకటేష్, యాక్షన్ : శంకర్ ఉయ్యాల, ఆర్ట్ : కష్ణ చిత్తనుర్, డిటియస్ : రాధాకష్ణ.