Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నరసింహ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'జాతీయ రహదారి'. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ చాలా గొప్పగా ఉంది. హదయాన్ని హత్తుకునేలా ఉంది. నిర్మాత రామసత్యనారాయణకు ఈ సినిమా ఒక మైల్‌స్టోన్‌గా నిలవాలి. మంచి పేరుతోపాటు అవార్డులూ రావాలి' అని చెప్పారు.
'నా గురువు బి.గోపాల్. ఆయన గురువు రాఘవేంద్రరావుగారికి ట్రైలర్ నచ్చి, సినిమా కూడా చూస్తానన్నారు. నాకు ఇంతకంటే గొప్ప విజయం ఏమీ లేదు. నన్ను నమ్మి సినిమా తీసిన నా నిర్మాతకి డబ్బులతోపాటు అవార్డ్స్ కూడా వస్తాయి' అని దర్శకుడు నరసింహ నంది తెలిపారు.
నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ, 'దర్శకేంద్రుడికి మా ట్రైలర్ నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ఓ మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించా. అయితే ఇంత సంతృప్తి ఏ సినిమాకీ కలగలేదు. ఓ నిర్మాతగా చాలా గర్వపడుతున్నా. ఈ నెల 10న తేదీన థియేటర్లలో మా సినిమాని రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు.