Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తాన్యా దేశాయ్, అంకిత్ రాజ్, కావ్యా రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా నటించిన చిత్రం 'స్ట్రీట్ లైట్'. మూవీ మాక్స్ బ్యానర్ పై విశ్వ దర్శకత్వంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ మామిడాల శ్రీనివాస్ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది.
నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ, 'నేను చేసిన మొదటి చిత్రం 'మౌన పోరాటం'లో నేనే హీరో, నేనే విలన్. ఇన్ని రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు అటువంటి మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. ఈ సినిమా చాలా హాట్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా.. అన్ని ఎమోషన్స్‌తో తెరకెక్కిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా' అని తెలిపారు.'సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటీటీ నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్‌తో మా సినిమాని థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తున్నాం. ఈ నెల మూడవ వారంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. అందరూ బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో ఆన్ని రకాల షేడ్స్, ఎమోషన్స్, మంచి మెసేజ్ ఉన్న సినిమా ది. ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది' అని నిర్మాత మామిడాల శ్రీనివాస్ అన్నారు.
దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ, 'స్ట్రీట్‌లైట్ కాన్సెప్ట్ దృష్ట్యా అందరి సహకారంతో రెండు గంటల సినిమాను 100 మీటర్ల స్థలంలో తీయగలిగాం. ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను ఆదరించాలి' అని చెప్పారు.