Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నేడు (శుక్రవారం) థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం వైభవంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ వేడుకలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ, 'ఇది పక్కా మాస్ కమర్షియల్ సినిమా. ప్రేక్షకులను ఇంటి నుంచి థియేటర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే నమ్మకం ఉంది. ఈ సినిమాను ఆదరిస్తే, మిమ్మల్ని అలరించడానికి చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బడ్జెట్ అవుతుందని నేను చెబితే, కథ నచ్చిందండి అని చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. ఆ రోజు నుంచి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని చాలా గొప్పగా నిర్మించిన నిర్మాతలు శ్రీను, పవన్‌గారికి థ్యాంక్స్. సంపత్ నందితో 'గౌతమ్ నంద' సినిమా చేశా. ఇది రెండో సినిమా. దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మనసు పెట్టి చేశాడు. ఇది థియేటర్స్‌లో చూసి ఎంజారు చేసే సినిమా. తప్పకుండా థియేటర్స్‌కి వచ్చి సినిమా చూడండి. ఎంజారు చేసి మరీ ఇంటికెళ్తారు' అని చెప్పారు.
డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ, 'సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మనకు స్వాతంత్య్రం రాక ముందే మన జీవితాల్లోకి సినిమా వచ్చింది. చైనా తర్వాత ఎక్కువ థియేటర్స్ ఉన్న దేశం మనదే. మన తెలుగు రాష్ట్రాల్లోనే 2800 నుంచి 3000 వరకు థియేటర్స్ ఉన్నాయి. మన దేశంలో క్రికెట్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్మెంట్ సినిమానే. సినిమా మనకు ఫ్రైడే పండగను తీసుకొస్తుంది. అన్నీ మతాలవాళ్లు వెళ్లే ఒకే ఒక గుడి థియేటర్. అలాంటి థియేటర్ ఈరోజు కష్టాల్లో ఉంది. మళ్లీ సినిమాలు థియేటర్స్‌లో విజంభించాలి. అది కచ్చితంగా జరుగుతుంది. ఈ విషయాన్ని నమ్మే మా నిర్మాతలు శ్రీను, పవన్ ఎన్ని ఓటీటీ ఆఫర్స్ వచ్చినా థియేటర్స్‌లోనే విడుదల చేయాలని వెయిట్ చేశారు. ఇది 'దంగల్', 'చక్ దే ఇండియా' తరహాలో కేవలం స్పోర్ట్స్ సినిమా కాదు.. మాస్ కమర్షియల్ సినిమా' అని అన్నారు. ఈ వేడుకలో రాజమండ్రి లోక్‌సభ ఎం.పి భరత్, బోయపాటి శ్రీను, డైరెక్టర్ లింగుస్వామి, శ్రీవాస్, మారుతి, నిర్మాత కె.కె.రాధామోహన్, రైటర్ కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, హీరోయిన్ అప్సర రాణి, మంగ్లీ తదితరులు పాల్గొని ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని ఆకాంక్షించారు.