Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే చిత్రానికి 'భవదీయుడు.. భగత్ సింగ్' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఓ పోస్టర్ని బుధవారం రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ, ''భవదీయుడు'.. అనేది వినయం, విధేయతకి ప్రతిబింబమైతే, 'భగత్ సింగ్' విప్లవ చైతన్యానికి మారుపేరుగా స్ఫురిస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఈ చిత్రానికి 'భవదీయుడు భగత్ సింగ్' అని టైటిల్ పెట్టడంలో దర్శకుడి ఆంతర్యమేమిటి?, సామాజిక అంశాల నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందా.. ఇలా అనేక రకాల ప్రశ్నల పరంపరని పోస్టర్ రైజ్ చేస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు మరోసారి అభిమాన ప్రేక్షకులను నిస్సందేహంగా ఉర్రూతలూగించనున్నాయి. మరెన్నో విశేషాలు, ప్రత్యేకతలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ కానున్నాయి. డైనమైట్ లాంటి హీరో సినిమాకి, డైనమైట్ లాంటి టైటిల్ పెట్టడంతో అందరిలోనూ ఉత్సుకత, అంచనాలు మరింతగా పెరిగాయి. అలాగే పవర్‌స్టార్, హరీష్ శంకర్ వంటి హిట్ కాంబినేషన్ సైతం ఈ ప్రాజెక్ట్‌కి మంచి క్రేజ్‌ని తీసుకొచ్చింది. 'దిస్ టైం.. ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్' అని పోస్టర్లో కనిపించే క్యాప్షన్‌ని జస్టిఫై చేసేలా 'భవదీయుడు.. భగత్ సింగ్' ఉండబోతోందని వేరే చెప్పక్కర్లేదు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. మా సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది' అని తెలిపారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : అయనాంక బోస్, కళా దర్శకత్వం : ఆనంద సాయి, ఎడిటర్ : చోటా కె ప్రసాద్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్.