Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రిన్స్, దివ్యాంగనా హీరో, హీరోయిన్లుగా గోపాల కిషన్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిలర్ 'ఐయామ్ మీరా'. శ్రీ శివ భవాని సినిమా ప్రొడక్షన్స్ పతాకంపై గుగ్గిళ్ల శివప్రసాద్ నిర్మించారు.
ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు గోపాల కిషన్ మాట్లాడుతూ, 'కథాను గుణంగా మా నిర్మాత గుగ్గళ్ల శివప్రసాద్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఇప్పటివరకు ఎన్నో సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చాయి. వాటి భిన్నంగా మా సినిమా ఉంటుంది' అని చెప్పారు.'దర్శకుడు గోపాల కిషన్ చెప్పిన స్టోరీ చాలా కొత్తగా అనిపించింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కి హీరో ప్రిన్స్ అయితే న్యాయం చేయగలడనిపించి అప్రోచ్ అయ్యాం. ఆయన కూడా కథ విని బాగా ఇంప్రెస్ అయ్యారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే గ్రీన్‌సిగల్ ఇచ్చారు. ఇందులో ఆయన క్యారెక్టర్ నెెగెటివ్ షేడ్‌లో ఉంటూ, సరికొత్తగా కనిపించబోతున్నారు. ఆద్యంతం మంచి ట్విస్ట్‌లు, సస్పెన్స్‌తో ప్రేక్షకుల్ని మా సినిమా అలరిస్తుందనే నమ్మకం ఉంది' అని నిర్మాత గుగ్గిళ్ల శివప్రసాద్ తెలిపారు.ఈ చిత్రానికి కో - ప్రొడ్యూసర్స్ : గుగ్గిళ్ల రాము, గుగ్గిళ్ల నాగ భూషణం, సంగీతం : భరత్, కెమెరా : ప్రభాకర్ రెడ్డి. జె, పాటలు : గణేష్ చిన్న మెస్రం, ఎడిటర్ : బసవ రెడ్డి పైడి.