Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో నితిన్, ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి 'మాచర్ల నియోజకవర్గం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా, మరో నిర్మాత రామ్మోహన్ కెమెరా స్విచాన్ చేశారు.
తొలి షాట్‌కు దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు వెంకీ కుడుముల స్క్రిప్టును మేకర్స్‌కి అందజేశారు. 'ఇది వరకు పోషించని పాత్రలో నితిన్‌ను పవర్ ఫుల్‌గా చూపించేందుకు దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన స్క్రిప్ట్‌ని రెడీ చేశారు. అదే విషయాన్ని మోషన్ పోస్టర్ ద్వారా మేకర్స్ తెెలియజేశారు. 'మాచర్ల నియోజకవర్గం' టైటిల్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చిత్రీకరణ ప్రారంభం కాకముందే అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇందులో నితిన్ సరసన కతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటించబోయే ఈ చిత్రానికి అద్భుతమైన సాంకేతిక బందం పని చేయనుంది. 'భీష్మ', 'మాస్ట్రో' వంటి చిత్రాల మూడోసారి మహతి స్వరసాగర్‌తో కలిసి నితిన్ పని చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్‌గా, మామిడాల తిరుపతి మాటల రచయితగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్‌గా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ నెలలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుంది' అని చిత్ర బృందం తెలిపింది. ఇదిలా ఉంటే, నితిన్ నటించిన తాజా చిత్రం 'మాస్ట్రో' ఈనెల 17న డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.