Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గత పదేళ్లలో నాకు ఇంత పెద్ద హిట్ రాలేదు. మా హీరో గోపీచంద్ అభిమానుల్ని 'సీటీమార్' గ్రాండ్ సక్సెస్ సంతోషపడేలా చేసింది. ఏ డైరెక్టర్‌కైనా ఓ హీరో, ఆయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలయ్యే సినిమా చేస్తే, దాని కన్నా గర్వంగా ఫీలయ్యే క్షణమే ఉండదు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మూడ్‌లో ఉన్నాను' అని దర్శకుడు సంపత్‌నంది అన్నారు.
గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'సీటీమార్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణతో విజయం సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది శనివారం మీడియాతో మాట్లాడుతూ, 'తెలుగు రాష్ట్రాలతోపాటు చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు పడ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఉమెన్ ఎంపవర్మెంట్, వాళ్లు ఓ లక్ష్యం కోసం పోరాడటం.. వంటి ఎమోషన్స్‌కు అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్, క్లైమాక్స్, అందులోని యాక్షన్ గురించి అందరూ మాట్లాడుకోవడం ఆనందంగా ఉంది. అలాగే 'బెంగాల్ టైగర్' తర్వాత ఆ స్థాయిలో మంచి డైలాగ్స్ ఈ సినిమాకి కుదిరాయని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. అయితే నిర్మాతలు మాకు సపోర్ట్‌గా నిలిచారు. కమర్షియల్ సినిమా అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకమే మమ్మల్ని థియేటర్లో రిలీజ్ చేసేలా చేసింది. ఇది హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ప్రేక్షకుల విజయంగా భావిస్తున్నాను. గోపీచంద్‌తోపాటు ఆయన ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉండటం, అలాగే తమన్నాతో హ్యాట్రిక్ హిట్ కొట్టడం చాలా హ్యాపీగా ఉంది' అని చెప్పారు.