Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె.నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ సినిమాని ఈనెల 24న థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ, 'కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ మా 'లవ్ స్టోరీ' కావడం విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ప్రేక్షకులు కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లూ మా చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాని మీకెప్పుడెప్పుడు చూపించాలా అని ఆత్రుతగా, సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ మంచి సమయం రానే వచ్చింది. ఈ నెల 24న మా చిత్రాన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉంది' అని చెప్పారు.
''లవ్ స్టోరీ' సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్‌లో 'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. మ్యూజికల్‌గా హిట్ అవడం సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి' అని చిత్ర యూనిట్ పేర్కొంది.రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు, దేవయాని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజరు సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్ కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహ నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వరరావు.