Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం '1997'. డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో గాయని మంగ్లీ పాడిన 'ఏమి బతుకు ...' అనే సాంగ్‌ని శనివారం చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సంగీత దర్శకుడు కోటి విడుదల చేశారు.
ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ,'నేను చేసిన 'బ్లేడ్ బాబ్జి' సినిమాలో మోహన్ నటించాడు. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా పవర్ ఫుల్ కథతో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. కథ విషయంలో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేశాడు. మంగ్లీ పాడిన పాట విని, చాలా ఎమోషనల్ అయ్యాను. ఆలోచింపచేసేలా ఉండే సాంగ్ ఇది. ముఖ్యంగా మనసుల్ని కదిలించే సాంగ్. సామజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది' అని తెలిపారు.
'మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి. ఇందులో ఓ సాంగ్ యాడ్ చేద్దామని మోహన్ చెబితే, సరే అన్నాను. తానే ఈ సాంగ్‌ని అద్భుతంగా రాశాడు. ఈ పాటకు మంగ్లీ అయితేనే న్యాయం చేస్తుందని ఆమెతో పాడించాం. మంగ్లీ పాడటంతో ఈ సాంగ్ మరో రేంజ్‌కి వెళ్ళింది. ఈ పాటకు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది' అని సంగీత దర్శకుడు కోటి అన్నారు. హీరో మోహన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తయ్యాక, ఇందులో ఓ సాంగ్ పెడితే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కార్యరూపం దాల్చి మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. పాట చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరినీ కదిలించే సాంగ్ ఇది. తప్పకుండా వ్యూస్‌తో సంచలనం క్రియేట్ చేస్తుంది' అని చెప్పారు.