Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'మాస్ట్రో'. శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. ఈనెల 17న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కథానాయిక నభానటేష్ ఆదివారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
'అంధాదున్' సినిమా చూశాను. బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా. అలాంటి సినిమా నాకు మొదటి రీమేక్ కావడంతో కొంచెం భయపడ్డా. ఎందుకంటే ఒరిజినల్లో రాధికా ఆప్టే అద్భుతంగా నటించింది. ఆమెలా చేయగలనా? లేదా అనిపించింది. అయితే ఇలాంటి పాత్రను ఇంతవరకు చేయలేదు. దీంతో దీన్నొక ఛాలెంజింగ్‌గా తీసుకున్నా. ఇందులో చాలా కొత్తగా కనిపిస్తాను. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు కూడా అదే అంటారు.
'అంధాదున్' కథని మాత్రం తీసుకుని దర్శకుడు గాంధీగారు తన విజన్‌తో సినిమాని తెరకెక్కించారు. దానికి, దీనికి సంబంధం ఉండదు. అలాగే నా పాత్రలోనూ ఎన్నో మార్పులు, చేర్పులు చేశారు. పాటలు కూడా కనెక్ట్ అయ్యేలా పెట్టారు. అచ్చ తెలుగు సినిమాలా ఉంటుంది.
మన తెలుగు ఆడియెన్స్ రీచ్ వేరు. ఒరిజినల్ సినిమాని చూసినా కూడా దీన్ని కూడా చూస్తారు. కొత్త సినిమాల కోసం మన వాళ్లు ఎదురుచూస్తున్నారు. అదే మాకు అడ్వాంటేజ్. నేను కూడా సినిమా చూడాలని ఆరాటపడుతున్నా.
'అంధాదున్' చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఈ సినిమాని ఎలా తీశారు?, నా పాత్ర ఎలా ఉందని కచ్చితంగా పోలుస్తారు. ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి (నవ్వుతూ).
నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. తమన్నా, దర్శకుడు గాంధీతోపాటు చిత్రయూనిట్ మొత్తం బాగా సహకరించింది. అందుకే షూటింగ్ చేస్తున్నామనే ఫీలింగ్ కలగలేదు.ఈ సినిమాకి డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశా. కానీ కుదరలేదు. నేను బెంగుళూరులో ఉండటం. కరోనా కండీషన్లు.. ఇవన్నీ డబ్బింగ్‌కి సహకరించలేదు. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతా. సొంత డబ్బింగ్ అనేది పాత్రకు ప్రాణం పోస్తుందనేది నా నమ్మకం.
కరోనా టైమ్‌లో నేను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. కరోనా లాక్డౌన్ తర్వాత కూడా థియేటర్ల సమస్య ఇంకా ఉంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలను ఎక్కువ మంది చూసేందుకు ఛాన్స్ ఉంది. అయితే థియేటర్ ఎప్పటికీ థియేటరే. దాని అనుభూతి దేనికీ రాదు.
అన్ని రకాల జోనర్లలో సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. పాత్రల పరంగా ఫలానా పాత్రలే చేయాలి అని నిబంధనలు పెట్టు కోలేదు. అన్ని రకాల పాత్రలు చేయడానికి రెడీగా ఉన్నా.