Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కోవిడ్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో చాలా సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను నవ్వించాయి. అయితే మేం ఏకంగా నవ్వులతో ఈనెల 17న దాడి చేయబోతున్నాం' అని అంటోంది 'గల్లీరౌడీ' చిత్ర బృందం.
సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గల్లీరౌడీ'. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మాత. ఈ చిత్ర ట్రైలర్‌ను ఆదివారం అగ్ర కథానాయకుడు చిరంజీవి రిలీజ్ చేశారు.
'ఇది పక్కా హిలేరియస్ ఎంటర్టైనర్. ఇందులోని అన్ని ఎలిమెంట్స్ విందుభోజనంలా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయని మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ చెప్పకనే చెప్పింది. సందీప్‌కిషన్, నేహాశెట్టి, వైవా హర్ష, బాబీ సింహ, రాజేంద్ర ప్రసాద్.. ఇలా ప్రతి పాత్ర నవ్వుల్ని పండిస్తుంది. దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి మార్క్ మేకింగ్‌తో ఈనెల 17న విడుదలయ్యే సినిమా ఎలా ఉండబోతుందోననే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేసేలా ట్రైలర్ ఎంటర్టైనింగ్గా ఉంది' అని చిత్ర యూనిట్ పేర్కొంది. పోసాని కష్ణ మురళి, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: జి.వి, సంగీతం: చౌరస్తా రామ్, సాయికార్తీక్, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కథ: భాను, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్.