Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బన్నీ వాసు, వాసు వర్మ నిర్మాతలు. ఈనెల 15న ఈ చిత్రంలోని 'లెహరాయి...' అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ సాంగ్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది. అఖిల్, పూజల రొమాంటిక్ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్ అందర్నీ అలరిస్తోంది.
'ఈ చిత్ర ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. తన చిత్రాల్లోని పాత్రల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో, లవ్లీగా ఉండేలా డిజైన్ చేయడంలో దర్శకుడు భాస్కర్ దిట్ట. ఈ సినిమాలోనూ అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేశారు. ఇక అఖిల్, పూజా జంట ప్రేక్షకుల్ని కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని చిత్రయూనిట్ తెలిపింది.