Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సినీనటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి క్యాన్సర్‌తో పోరాడుతూ కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్ చికిత్స పొందుతున్న ఆమె సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ సహా ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిరంజీవి, జీవిత రాజశేఖర్, ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీ, ఏడిద శ్రీరామ్ తదితర పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్‌ను పరామర్శించి, ధైర్యం చెబుతున్న తరుణంలో భావోద్వేగానికి లోనైన ఉత్తేజ్‌ని చూసి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. పద్మావతి భౌతికకాయాన్ని తొలుత బసవతారకం ఆస్పత్రి నుంచి బోరబండలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి తరలించారు. అక్కడ ఉత్తేజ్ మేనమామ సుద్దాల అశోక్ తేజతోపాటు కుటుంబసభ్యులు, సన్నిహితులు ఆమెకు నివాళ్ళర్పించారు. అనంతరం ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో పద్మావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉత్తేజ్ నిర్వహించే మయూఖా టాకీస్ ఫిల్మ్ యూక్టింగ్ స్కూల్‌తోపాటు పలు సేవా కార్యక్రమాల్లోనూ పద్మావతి చురుగ్గా పాల్గొనేవారు.