Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నోయల్ సీన్, మెహబూబ్, సుమీత బజాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'చకోరి'. సత్య ధానేకుల దర్శకుడు. ఆష్టా సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దేవు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి తాజాగా 'నా చెలివే...రాక్షసివే' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ని దర్శక, నిర్మాతలు విడుదల చేశారు.
నోయల్ సీన్, మెహబూబ్‌పై చిత్రీకరించిన ఈ పాటకు లీండర్ లీ మార్టీ స్వరాలు సమకూర్చగా, చిత్రన్ సాహిత్యం అందించారు. పాపులర్ సింగర్ సిద్ శ్రీరామ్ మరోసారి తన అద్భుతమైన గాత్రంతో శ్రోతల్ని ఫిదా చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. క్రాంతి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీలం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.