Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ ఆంటోని హీరోగా, 'మెట్రో' ఫేమ్ ఆనంద కష్ణన్ తెరకెక్కించిన చిత్రం 'విజయ రాఘవన్'. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్ సమర్పణలో చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్.సంజరు కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
'కోడియిల్ ఒరువన్' పేరుతో తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని 'విజయ రాఘవన్'గా శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బిగ్ టిక్కెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాతలు రవిచంద్రా రెడ్డి, శివారెడ్డి మాట్లాడుతూ, 'విజయ్ ఆంటోనితో ఆనంద్ కష్ణన్ అద్భుతమైన కథతో సినిమా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. సినిమాపై నమ్మకంతో ఉన్నాం. ఈనెల 17న విడుదలవుతున్న మా సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ఆశిస్తున్నాం' అని చెప్పారు.
'దర్శకుడిగా నా తొలి చిత్రం 'మెట్రో' తెలుగులో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా రిలీజ్ అవుతుండటం హ్యాపీగా ఉంది. ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకునే ఓ యువకుడి కథే ఇది. జీవితంలో ఎన్నో సాధించాలనుకునే హీరో, తన తల్లి కోరికను తీర్చాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైన సమస్యలు ఏంటి?, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే సినిమా. ఇదొక పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అలాగే సమాజంలో మనకి ఎదురయ్యే రాజకీయ పరమైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాలనే సందేశం కూడా ఇస్తుంది. నివాస్ మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక మంచి రోల్లో యాక్ట్ చేసింది' అని దర్శకుడు ఆనంద కష్ణన్ అన్నారు. హీరోయిన్ ఆత్మిక మాట్లాడుతూ, 'మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. అలాంటి ఓ మంచి చిత్రమే ఈ 'విజయ రాఘవన్'' అని తెలిపారు.
హీరో విజయ్ ఆంటోని మాట్లాడుతూ, 'ఈ సినిమాను నిర్మించిన రాజా, కమల్, ప్రదీప్, ధనంజయన్‌గారికి థ్యాంక్స్. బాగా ఖర్చు పెట్టి ఓ మంచి కమర్షియల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుదల చేస్తున్న రవిచంద్రా రెడ్డి, శివారెడ్డికి థ్యాంక్స్. ఓ ఎడిటర్‌గా కూడా ఈ సినిమాను చాలా సార్లు చూశాను. సినిమాలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ప్రేక్షకులను సినిమా డిజప్పాయింట్ చేయదు. 'బిచ్చగాడు' ఓ అమ్మకథ అయితే, 'విజయ రాఘవన్' అమ్మ కలను నేరవేర్చే కొడుకు సినిమా. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు' అని అన్నారు.