Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకుల విశేష ఆదరణతో సంచలన విజయం సాధించిన చిత్రం 'డోన్ట్ బ్రీత్'. 2016లో రిలీజైన ఈ హర్రర్ థ్రిల్లర్ చిత్రానికి సీక్వెల్గా 'డోన్ట్ బ్రీత్ 2' చిత్రాన్ని తెరకెక్కించారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో దాదాపు వెయ్యికి పైగా థియేటర్లలో ఈ సినిమా ఈనెల 17న సోనీ పిక్చర్స్ ద్వారా విడుదలకు సిద్ధమైంది.
'నూతన దర్శకుడు రోడో సాయాగ్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో స్టీఫెన్లాగ్, మ్యాడ్లిన్గ్రేస్ తండ్రీకూతుళ్ళుగా నటించారు. కిడ్నాప్కి గురైన తన 11 ఏండ్ల కూతురి కోసం అంధుడైన తండ్రి ఏం చేశాడు?, ముఖ్యంగా స్టీఫెన్లో దాగి ఉన్న అదృశ్య శక్తులు ఎలా బయటికొచ్చాయి?, వాటి వల్ల ఏం జరిగింది?, చివరకు తన కూతురిని కాపాడుకున్నాడా లేదా? అనే ఆసక్తికర అంశాల సమాహారంగా ఈ చిత్రాన్ని దర్శకుడు రోడో ఆద్యంతం ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. దేశ వ్యాప్తంగా 1000 థియేటర్ల ద్వారా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈనెల 17న విడుదలయ్యే ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరిస్తుంది' అని సోనీ పిక్చర్స్ ప్రతినిధులు తెలిపారు.