Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రెజీనా కసాండ్ర రాణిగా, పురావస్తు శాస్త్రవేత్తగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం 'నేనే నా..?'. 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి సినిమా 'జాంబీరెడ్డి'తో సూపర్ హిట్ సాధించిన రాజశేఖర్ వర్మ తన ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిధి అగర్వాల్, విజరు సేతుపతి, డైరెక్టర్ లింగుసామి ఆవిష్కరించారు.
'ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తోనే అందరిలోనూ మంచి ఆసక్తిని రేకెత్తించింది. 100 సంవత్సరాల క్రితం జరిగిన ఒక భయంకరమైన సంఘటన మరలా పునరావతమవుతోందనే విషయంతోపాటు రెజీనా 100 ఏండ్ల క్రితం రాణి అయితే, ఆమె ప్రస్తుతం పురావస్తు శాస్త్రవేత్తగా ఒక రహస్య కేసును చేధించడానికి వచ్చినట్టు టీజర్ చెప్పకనే చెబుతోంది. అడవిలోకి ప్రవేశించే వ్యక్తులతో పాటు, రహస్య కేసును పరిష్కరించడానికి వచ్చిన వాళ్ళు సైతం చంపబడుతుండటం, గతం, ప్రస్తుత కథకి మధ్య ఉన్న లింక్ ఏంటనే ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్స్, కామెడీతో ఉన్న ఈ మిస్టరీ సబ్జెక్ట్ ప్రేక్షకులకు తప్పకుండా సరికొత్త అనుభూతిని అందించనుంది. దర్శకుడు కార్తీక్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కాస్టింగ్, సాంకేతిక ప్రమాణాల పరంగా కూడా ఇది భారీ ప్రాజెక్ట్. తెలుగు, తమిళంలో ఏక కాలంలో ఈ మూవీలోని కీలక సన్నివేశాలను కుర్తాళం, చుట్టుపక్కల ప్రాంతాలలో చిత్రీకరించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. వెన్నెల కిషోర్, అక్షరగౌడ, తాగుబోతు రమేష్, జయ ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీ ఎస్, డీఓపి: గోకుల్ బినోరు, ఎడిటర్: సాబు, స్టంట్స్: సూపర్ సుబ్బరాయన్.