Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రారులక్ష్మి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం 'సిండ్రెల్లా'. తమిళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని సుదీక్ష ఎంటర్టైన్మెంట్, ఎంఎన్ఆర్ మూవీస్ పతాకాలపై మంచాల రవికిరణ్, ఎం.ఎన్.రాజు సంయుక్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఎస్.జె.సూర్య శిష్యుడు విను వెంకటేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లేటెస్ట్గా ఈ చిత్ర టీజర్‌ను హీరో విజరు ఆంటోని రిలీజ్ చేశారు.
'హర్రర్, ఫాంటసీ, మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. 'సర్కార్ 3', 'కిల్లింగ్ వీరప్పన్' చిత్రాలకు కెమెరామెన్‌గా వర్క్ చేసిన రమ్మీ ఈ సినిమాకి అద్భుతమైన విజువల్ ట్రీట్ ఇచ్చారు. 'కాంచన 2' చిత్రానికి సంగీతాన్ని అందించిన అశ్వామిత్ర సమకూర్చిన సంగీతానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'గేమ్ ఓవర్' చిత్రానికి సౌండ్ డిజైన్ చేసిన సచిన్ చేసిన సౌండ్ డిజైనింగ్ ఈ చిత్రానికి హైలైట్ కానుంది. త్వరలోనే ఈ సినిమాని విడుదల చేస్తాం' అని నిర్మాతలు చెప్పారు.