Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'భావోద్వేగ భరిత ప్రేమకథగా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మా 'లవ్‌స్టోరీ' ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. రేవంత్, మౌనికల ప్రేమకథ ప్రేక్షకుల మనసుల్ని తాకేలా ఉంటుంది' అని నిర్మాతలు నారాయణ్ దాస్ కె నారంగ్, పి.రామ్మోహన్ రావు అన్నారు.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన చిత్రం 'లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై కె.నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్రావు సంయుక్తంగా నిర్మించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కి వచ్చిన రెస్పాన్స్ గురించి మేకర్స్ మాట్లాడుతూ, 'తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్ అనే ఓ మిడిల్ క్లాస్ కుర్రాడుగా నాగ చైతన్య కనిపించిన తీరు, లోన్ ద్వారా బిజినెస్ చేసి లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకునే డ్యాన్సర్ రేవంత్‌గా నాగచైతన్య నటన, సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయిపల్లవి, ఆమెలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్‌ని రేవంత్ గుర్తించడం, ఆమె మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహించడం, ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం, ఆ స్నేహం ప్రేమగా మారడం, వీళ్ళ ప్రేమకి అడ్డంకులు ఏర్పడటం, ఆ అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారనేదే ఈ సినిమా అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుందని, అలాగే నేచురల్ బ్యూటీ సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసిందంటూ అందరూ ప్రశసింస్తున్నారు. 'మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా..', 'బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని చద్దాం..' వంటి డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని, మిడిల్ క్లాస్ యువకుడిగా నాగ చైతన్య తన కెరీర్లోనే ది బెస్ట్‌గా నటించారని సోషల్‌మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పెడుతుండటం సంతోషంగా ఉంది. మా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తనదైన మార్క్‌తో, ఆద్యంతం భావోద్వేగభరితంగా తెరకెక్కించారు' అని తెలిపారు.