Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా 'జెమ్'. ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకుడు. ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది.
ఈ సందర్భంగా దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'ఇద్దరు అమ్మాయిల మధ్య చిన్నప్పటి నుంచి పెరుగుతూ వచ్చిన అహం ఎలాంటి పరిణామాలు తీసుకొచ్చింది అనేదే ఈ కథ. ఈ ఇద్దరు అమ్మాయిల మధ్య ఇరుక్కున్న ఓ అబ్బాయి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి?, తన ప్రేమను హీరో ఎలా సాధించుకున్నాడు అనేది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. ఈ సినిమాకి పవర్ఫుల్ నేపథ్యం ఉండాలని రాయలసీమ బ్యాక్‌డ్రాప్ పెట్టాం. అయితే, ఈ కథకు రాయలసీమ బ్యాక్ డ్రాప్‌కు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ కథలో హీరో క్యారెక్టర్ 'వీడు జెమ్ రా' అనిపించేలా ఉంటుంది. అతనిలో సూపర్ హీరో లక్షణాలు ఉంటాయి. అందుకే టైటిల్ 'జెమ్' అని పెట్టాం. రాశీ సింగ్, నక్షత్ర, విజరు రాజా ఈ మూడు క్యారెక్టర్స్ సినిమాలో కీలకం. సినిమా రిలీజ్ తర్వాత ఈ ముగ్గురికీ మంచి పేరొస్తుంది. సునీల్ కశ్యప్ సంగీతం, ఆండ్రూ సినిమాటోగ్రఫీ మా సినిమాని మరో లెవెల్‌కి తీసుకెళ్లాయి. నా నెక్ట్ సినిమా మల్టీస్టారర్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది' అని అన్నారు.