Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు గణేష్ బెల్లంకొండ హీరోగా నటిస్తున్న చిత్రానికి 'స్వాతిముత్యం' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. గణేష్ బెల్లంకొండను హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ వెండితెరకు పరిచయం చేస్తోంది.
యువ నిర్మాత సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో బెల్లంకొండ గణేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ని ఎనౌన్స్ చేయడంతోపాటు ఫస్ట్‌లుక్‌ని చిత్ర బృందం మంగళవారం రిలీజ్ చేసింది. 'వర్ష బొల్లమ్మ' కధానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ''స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి అంశాల్లో ఆలోచనలు, అభిప్రాయాల సమాహారంలో అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ సినిమా' అని దర్శకుడు చెప్పారు.'వినోదాన్ని పుష్కలంగా అందిస్తూనే కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలు ప్రేక్షకుల్ని అలరించేలా ఈ సినిమా ఉంటుంది. షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది' అని నిర్మాత తెలిపారు.